మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న అవార్డు ఇవ్వడం పట్ల పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. భారత దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి తోడ్పడిన పీవీని గౌరవించడం సంతోషకరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని…