Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంగళవారం ఉదయం గ్రామ దేవత అయిన మూల పెద్దమ్మ దేవరలో గండా దీపం మోసిన అనంతరం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, గండా దీపం మోసిన వెంటనే అలసట, అస్వస్థతకు గురై అక్కడికక్కడే పడిపోయారు. వెంటనే అక్కడున్న అనుచరులు, పార్టీ శ్రేణులు ఆమెను అత్యవసరంగా అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి…