త్వరలోనే స్పోర్ట్స్ డ్రామా “గని”తో ప్రేక్షకులను అలరించబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో నటీనటులు, సిబ్బంది సమక్షంలో ప్రారంభమైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందజేశారు. నాగబాబు ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మజ కెమెరా…