త్వరలోనే స్పోర్ట్స్ డ్రామా “గని”తో ప్రేక్షకులను అలరించబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో నటీనటులు, సిబ్బంది సమక్షంలో ప్రారంభమైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందజేశారు. నాగబాబు ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మజ కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రానికి ముఖేష్ కెమెరా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నారు. ఆర్ట్ విభాగాన్ని అవినాష్ కొల్లా చూసుకుంటారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను తాత్కాలికంగా #VT12 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
Read Also : Krishna Vrinda Vihari Teaser : రొమాన్స్ ఓవర్ లోడెడ్
కాగా వరుణ్ తేజ్ “గని” చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘గని’ తెరకెక్కుతోంది. సంగీతం తమన్ అందించారు.