మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
బెంగాల్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.