Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు.
ఏపీలో డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్ 9) వెలువడనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
INDIA Alliance: లోక్‌సభ ఎన్నికల ప్రతి దశ ముగిసిన తర్వాత పూర్తి ఓటింగ్ శాతం గణాంకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు ప్రతిపక్ష ఇండియా అలయన్స్ నాయకులు గురువారం ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యాన్ని చూపారు. 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. గతంలో 2018 ఎన్నికల నమోదైన 72.44 శాతంతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువగా రికార్డ్ అయింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చినా.. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తాయని వెల్లడించాయి.