సార్వత్రిక ఎన్నికల ముందు పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మహిళలకు సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. పదేళ్ల బీజేపీ ప్రభుత్వ కాలంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు నిర్మలమ్మ చెప్పుకొచ్చారు.
Budget 2024 : ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌కు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఇది ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టబడుతుంది. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్‌లో సంక్షేమ వ్యయాలను పెంచడంపై ప్రభుత్వ దృష్టి ఉంటుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ పేర్కొంది.