పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.