Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా సోమవారం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత కథనాలేనని, రష్యా మరిన్ని దాడులకు కారణాలు చూపించుకోవడానికి, శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఉక్రెయిన్ పేర్కొంది.