Ukraine: అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన వాతావరణం కనిపిస్తోంది. గత వారం వైట్‌హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు నేతలు నువ్వా నేనా అన్న రీతిలో మీడియా ముందు లైవ్‌లోనే మాటలనుకున్నారు. దీంతో ప్రతిపాదిత ‘ఖనిజ ఒప్పందం’పై జెలెన్ స్కీ సంతకం చేయకుండానే వైట్ హౌజ్ నుంచి వెనుదిరిగారు.
Donald Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఓ నియంత.. అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డాడు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే కీవ్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తెచ్చారని విమర్శించాడు.