ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని ఆపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని.. కాలం చాలా శక్తివంతమైనదన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది.
Delhi Woman Dies After Car Drags Her For 12 Kilometres On New Year Morning: న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒళ్లుగగుర్పాటుకు గురయ్యే యాక్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. మహిళను ఢీకొట్టిన తర్వాత దాదాపుగా 10-12 కిలోమీటర్లు లాక్కెలింది కారు. ఈ ప్రమాదంలో మహిళ శరీరం దాదాపుగా ఛిద్రం అయింది. ఈ ఘటన ఢిల్లీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతురాలు అంజలి (20) ఢిల్లీ నివాసి. మహిళ పెళ్లిళ్లకు,…
తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత యోగా తరగతులు ఆగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 'ఢిల్లీ కి యోగశాల' స్కీమ్ ఫైల్‌పై అక్టోబర్ 26న సంతకం చేశారని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. ఆ పార్టీ నేతలు అతిషి, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు నోటీసులు పంపారు.