విశాఖలో గ్యాస్ లీక్‌లు, అగ్నిప్రమాదలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.. ఓ ఘటన జరిగి.. అది కాస్త మర్చిపోయే సమయానికి మరో సంఘటన ప్రజలను వణికిస్తోంది.. ఇవాళ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. రిఫైనరీ నుండి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.. ఇక, సైరన్ మోగడంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీసినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు.. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో.. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. మరోవైపు, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.