Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఒకటి యలమంచిలి. ఇక్కడ కాపు, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. గతంలో లేకున్నా… ఓట్ బ్యాంక్ ఆధారంగా ఇక్కడ పోటీ చేసేందుకు కాపు నేతలు ఆరాటపడటం దశాబ్ద కాలంగా కనిపిస్తోంది. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహా ఎక్కువ సార్లు గెలిచింది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. దీంతో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వ్యూహాలు కాపుల…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, కల్పించే వసతులపై వివరిస్తూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నారు.. ఇక, మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధం అయ్యారు సీఎం చంద్రబాబు.. వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు…
Gudivada Amarnath: చిన్నప్పుడు చందమామ కథలు వింటే.. ఇప్పుడు చంద్రబాబు కథలు వినాల్సి వస్తుంది అంటూ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని స్వాగతిస్తాం.. కానీ, వాటి వల్ల జరిగే ప్రయోజనాల మీద చర్చ జరగాలి అన్నారు.. ఏపీ ప్రభుత్వం-గూగుల్ మధ్య ఎంవోయూపై ఆయన స్పందిస్తూ.. డేటా సెంటర్ల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం ప్రపంచ వ్యాప్తంగా లేదన్నారు..…
Vizag Crime: వాళ్లు ఇద్దరు రౌడీషీటర్లు… అసలై మందు వేశారు.. ఆపై అమ్మాయి విషయంలో ఘర్షణ.. దీంతో, పరస్పరం దాడులు.. చివరకు ఒకరి ప్రాణాలు కూడా పోయాయి.. విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది… మద్యం మత్తులో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ.. ఓ రౌడీషీటర్ హత్యకు దారి తీసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7వ తేదీన కోర్టు వాయిదాకు విశాఖపట్నం వచ్చారు రౌడీ షీటర్ కసింకోట శ్రీధర్…
INDW vs SAW: మహిళల ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నాడు వైజాగ్ వేదికగా ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత మహిళల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ (Nadine de Klerk) మెరుపు ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..? టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన…
YS Jagan Road show: విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతోంది.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన. ఇక, విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నం రోడ్డు మార్గాన బయల్దేరారు.. పోలీసులు షరతుల మధ్య జగన్ టూర్ పై ఉత్కంఠ కొనసాగుతుండగా.. పోలీసులు నిర్దేశించిన పెందుర్తి., అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకోనున్నారు జగన్.. ఇక, కాకాని నగర్ దగ్గర…
విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. జగన్ పర్యటన రోజే విశాఖలో మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే జాతీయ రహదారి బ్లాక్ అవుతుందని, రోడ్ బ్లాక్ అయితే తమిళనాడులో దళపతి విజయ్ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ…
Havey Rain Alert: ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది రేపు ఉదయం తీరం దాటే ప్రమాదం ఉందంటోంది వాతావరణశాఖ. దీంతో ఏపీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 300 కి.మీ., గోపాల్‌పూర్‌కు 300 కి.మీ., పారాదీప్‌కు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని…
త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో…