Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్.. వైజాగ్‌లో త్వరలో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.. పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.. సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయి.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందన్నారు లోకేష్.. 16 నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయన్న ఆయన.. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిత్తల్ రూ.1.5లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. బీపీసీఎల్ రూ.లక్ష కోట్లు, ఎన్‌టీపీసీ రూ.1.60లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.. ఏపీకి సమర్థ నాయకత్వం ఉంది.. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సీఎం ఆధ్వర్యంలో సదస్సు జరగబోతుంది.. పెట్టుబడిదారులు, ప్రభుత్వం, ప్రజలు కలిస్తేనే సీఐఐ సదస్సు.. 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు..
Read Also: Apple Watch : యువకుడి ప్రాణం కాపాడిన ఆపిల్ వాచ్
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కల్పన ప్రధాన అంశం గా చూస్తున్నాం. వైజాగ్ లో త్వరలో సీఐఐ పార్టనర్ షిప్ సమిట్ జరగనుంది. ఉద్యోగాల కల్పన.. పెట్టుబడులు ప్రధాన ఎజెండా గా జరుగుతుంది.. 410 ఎంవోయూలపై సంతకాలు జరుగుతాయి. 9 .8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలుచ, ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. ఇక, 45 దేశాల నుంచి 300 పైగా ప్రతినిధులు వైజాగ్ లో జరిగే పారిశ్రామిక సదస్సుకు హాజరవుతారు. ప్రజా ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. 3 G20 దేశాలు, యూరప్, మిడిల్ ఏసియా లాంటి దేశాలతో పాటు పలువురు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, రామ్మోహన్, అశ్వనీ వైష్ణవ్, అన్నపూర్ణా దేవి, పలువురు MoS లు వస్తున్నారు మంత్రి నారా లోకేష్..