వైజాగ్ డ్రగ్ కేసులో గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది టీడీపీ పరిస్థితి అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా? అని దుయ్యబట్టారు. తమ పై విమర్శలు చేస్తున్నారు.. ఆ కంపెనీలు పురంధేశ్వరి దగ్గరి బంధువులది అని అంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు బలంగా అనిపిస్తుందని తెలిపారు. వైజాగ్ డ్రగ్ కేసులో…
ఆపరేషన్ గరుడ'లో భాగంగా డ్రై ఈస్ట్‌తో మిక్స్ చేసిన దాదాపు 25వేల కేజీల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను కలిగి ఉన్న షిప్పింగ్ కంటైనర్‌ను అదుపులోకి తీసుకుని.. మొత్తం సరుకును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం పోర్టులో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. ఏకంగా 1.4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్న కోల్ ధరతో పోలిస్తే.. తక్కువ ధరకు లభిస్తున్న దేశీయ బొగ్గు లభిస్తుండడంతో విదేశాల నుంచి బొగ్గును కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బొగ్గు ధరలలో వ్యత్యాసం కారణంగా కొనుగోళ్లు ఆగిపోయాయి.