విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. విశాఖ కాలుష్య నివారణకు, పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతాం అన్నారు..