విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది హనీ ట్రాప్ కేసు.. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు.. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కస్టడీలోకి తీసుకున్న కిలాడీ జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు పోలీసులు. జెమిమాకు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం.
సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నిందితురాలు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు జాయ్ జెమీమాను విచారిస్తున్నారు పోలీసులు... అయితే, కిలాడీ లేడీ పోలీసులు విచారణలో నోరు మెదపడం లేదట.. దీంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.. జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తించారు పోలీసులు... అందులోనే అసలైన డేటా ఉన్నట్లు తెలుస్తోంది.. మరో వైపు జెమీమా పరిచయాలపై కూడా నిఘా పెట్టారు.
కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. హనీ ట్రాప్ కేసు గుట్టు రట్టు అవ్వడంతో ఒక్కొక్కరిగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూలు కడుతున్నారు.. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది.. పోలీసులకే జలక్ ఇచ్చింది మాయ లేడీ జాయ్ జేమియా..
విశాఖలో ఓ కిలాడీ లేడీ వ్యవహారం వెలుగుచూసింది.. విదేశాల్లో స్థిరపడ్డ, బాగా సంపాదించిన మగవాళ్లే ఆమె టార్గెట్ కాగా.. సోషల్ మీడియా ద్వారా ఎన్నారైలకు వల విసరడం, అందమైన ఫోటోలు షేర్ చేసి ఆకర్షించడం, ప్రేమ పెళ్లి పేరుతో లైన్‌లో పెట్టడం.. అవసరం అయితే.. వీడియో కాల్స్ కూడా చేయడం.. ఆమె దినచర్య. అయితే, ఆమె మొహంలో పడితే అంతే.. వాళ్ల దగ్గర నుంచి దొరికినంత దోచుకుని.. నిండా ముంచేయడంలో ఆమె దిట్ట..