విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు నాని.. వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగల బడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి అని తెలిపాడు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని..