Vishnuvardhan Reddy: తెలుగుదేశం పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి.. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు..? అంటూ నిలదీశారు.. ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా తెలుగుదేశం పార్టీ తీరు ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. చాలా ఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు.. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ఇప్పుడు కేంద్రం, బీజేపీ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు ఎందుకు ? అంటూ మండిపడ్డారు.. రాష్ట్రాల శాంతి భద్రతల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం 2018-19 సమయంలోనే రాష్ట్రపతి పాలన వచ్చేది కాదా ? అని ప్రశ్నించిన ఆయన.. ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు పార్టీని దెబ్బతీసే ప్రకటనలు ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Adipurush : ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాషిర్ పూర్వీకుల ఇంటికి పోలీసులు కాపలా
యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ అని మండిపడ్డారు విష్ణువర్దన్‌రెడ్డి.. చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సూచించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విమర్శించే నైతిక హక్కు అచ్చెన్నకు లేదన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి. కాగా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వెళ్తే బాగుంటున్న వైఖరితో.. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు సాగుతోన్న విషయం విదితమే. ఆ మధ్య ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. ఆ తర్వాత జేపీ నడ్డా, అమిత్‌షా వరుసగా ఏపీలో పర్యటించడం.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం.. చర్చగా మారిన విషయం విదితమే.