మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి మూల కథను అందించగా, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను సమకూర్చడంతో పాటు కోన…
విష్ణు మంచు తాజా చిత్రం టైటిల్ వచ్చేసింది. ఈ టైటిల్ ప్రకటించేందుకు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. దీని కోసం రచయిత కోన వెంకట్, కెమెరామేన్ ఛోటా కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో భేటీ వేశాడు విష్ణు. ఈ భేటీలోనే టైటిల్ ఏమిటని కోనను విష్ణు అడగ్గా, ‘జిన్నా’ అని చెబుతాడు కోనవెంకట్. అయితే ఇది ‘గాలి నాగేశ్వరరావు’కు సంక్షిప్త రూపమంటూ దానికి తగ్గట్టుగా టైటిల్ అనేశాడు కోన. ‘జిన్నా’ అనగానే పాకిస్తాన్…
‘మా’ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. మా భవనాన్ని తన సొంత డబ్బు కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని… భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో లో మొదటి ప్రాధాన్యత అవకాశాలైన మా ఆప్ రెడీ చేస్తామని.. జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంచు విష్ణు మేనిఫెస్టోలోని…
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు.…
మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరాబాద్ లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పదవికి ఈసారి గట్టి పోటీనే ఎదురైయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే పోటీదారుల ప్రెస్ మీట్లతో టాలీవుడ్ లోని లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా మంచు విష్ణు ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తున్నానని లేఖ ద్వారా తెలియజేశాడు. తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకొనేలా సేవ చేయడమే నా కర్తవ్యం అంటూ లేఖలో పేర్కొన్నారు. మా నాన్న ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సేవలు, అనుభవాలు తనకు మార్గదర్శకాలు…
‘మా’ ఎన్నికలతో (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు పోటీదారులతో రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉంటుందనే వార్తలతో అంత ట్రయాంగిల్ వార్ అనుకున్నారు. అయితే, తాజాగా నటి హేమ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఈసారి ‘మా’ బరిలో ఆమె కూడా దిగుతున్నట్లుగా నమ్మదగ్గ సమాచారం. ఇప్పటికే…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే వాతావరణం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి రేసులో ఉన్న మంచు విష్ణు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. విశేషం ఏమంటే… పెద్దకొడుకు విష్ణు విజయం కోసం మోహన్ బాబు సైతం కదిలి వచ్చారు. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణను ఆయన నివాసంలో మోహన్ బాబు కలిసి, విష్ణుకు మద్దత్తు ఇవ్వవలసిందిగా కోరినట్టు తెలుస్తోంది. వారి సమావేశ సారాంశ వివరాలు అధికారికంగా బయటకు రాకపోయినా… కృష్ణను…