స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి విశాఖజిల్లా…
విజయనగరం జిల్లాలో రాజకీయంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నెల్లిమర్లతోపాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. విశాఖ-విజయనగరం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న సెగ్మెంట్. విశాఖకు దగ్గరగా ఉండటంతో రాజకీయాలు కూడా వాడీవేడీగా ఉంటాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెల్లిమర్ల పరిధిలోనే ఉంది. ఇవన్నీ చూసిన టీడీపీ నేతలు కొత్తగా వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మూడేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్నా.. ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో గేర్ మార్చేస్తున్నారు టీడీపీ నేతలు.…
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కోంటోంది. గత ఎన్నికల్లో 11 స్ధానాలను గెలుచుకోగా… రెబల్ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య పన్నెండుకు పెరిగింది. సంస్ధాగతంగా పార్టీ పటిష్టతకు, జిల్లా అభివృద్ధికి బాటలు వేసుకునే అవకాశం లభించింది. మంత్రివర్గ పునర్విభజన తర్వాత జిల్లాకు రెండు కీలకమైన పోర్ట్ ఫోలియోలు లభించాయి. గ్రామీణ అభివృద్ధి, ప్రజలతో నేరుగా సంబంధాలు వుండే మంత్రిత్వ శాఖలు కావడంతో నాయకత్వంలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ… క్షేత్ర స్ధాయిలో…
వైసీపీ మంత్రులు ప్రారంభించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రం రెండోరోజుకు చేరుకుంది. విశాఖలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. రెండో రోజు విశాఖ, తూ.గో. జిల్లాలలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర జరగనుంది. లంకాలపాలెం జంక్షన్, అనకాపల్లి బైపాస్, తాళ్లపాలెం జంక్షన్, యలమంచిలి వై రోడ్డు జంక్షన్, నక్కపల్లి, తుని, అన్నవరం, జగ్గంపేట మీదుగా ఈ…
విశాఖ నగరంపై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తోంది. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ అవసరాలు.. ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కేసుకుని ముందుకెళ్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశాల వరకు ప్రతీదానికీ కేలిక్యూలేషన్స్ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బయటపడిన సందర్భాలు తక్కువే. 2024నాటికి జీవీఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలనూ కైవశం చేసుకోవాలని…