ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు అవకతవకలపై లోతైన విచారణ జరపనున్నారు. విశాఖ సర్కిల్-4పరిధిలో నాలుగు షాపుల్లో నగదు పక్కదారిపట్టి నట్టు నిర్ధారణ అయింది. మొత్తం 33లక్షల రూపాయలు నొక్కేసారు సిబ్బంది. ఇందులో బాధ్యులైన సిఐ శ్రీనివాస్ ను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించిన అధికారులు.. సూపర్ వైజర్లు, వైన్ షాప్ సిబ్బంది ని విచారిస్తున్నారు. ఇంకా 12మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చాము. నిధులు…
విశాఖ ఎక్సయిజ్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతుంది. ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పరిధిలోని 14షాపుల్లో నగదు తేడాలు గుర్తించారు. లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు సిబ్బంది. వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అక్రమార్కులు నొక్కేసిన నగదు చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం. సర్కిల్-4లో వెలుగు చూసిన సిబ్బంది చేతివాటంతో విచారణ మొదలయింది. ఫేక్ చలాన్ల తో బ్యాంకు, ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయలు మాయం చేసారు.…
విశాఖలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…
విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. గతేడాది నుంచి విశాఖ జిల్లాలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా, అర్ధరాత్రి సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్‌లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు…
విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ రెండు పడవల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద జరిగింది. తెలంగాణలో లాక్డౌన్ కావడంతో వీరంతా సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి…
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్…
విశాఖ నగరంలో మెడికల్ షాపులు కిటకిటలాడుతోన్నాయి. మెడికల్ షాపుల ముందు బారులు తీరుతోన్నారు విశాఖ వాసులు. కొద్దిపాటి లక్షణాలు.. హోం ఐసోలేషనులో ఉన్న వారి కోసం మందులు కొనుగోళ్లకు రోడ్లపైకి వస్తున్నారు విశాఖ ప్రజలు. ఫాబి ఫ్లూ వంటి టాబ్లెట్లకు కొన్ని రకాల బ్రాండ్లల్లో కొరత ఉంటుంది అని మెడికల్ షాప్ ఓనర్లు. అయితే విశాఖలో ఆక్సీ మీటర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయితే ఏపీలో ఈ కరోనా సెకండ్ వేవ్ లో రోజుకు 20…
విశాఖలో కరోనా బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్స్, వైరాలజీ ల్యాబ్, కేజీహెచ్ హాస్పిటల్‌ను వెస్‌ఆర్‌సీపీ ఎం.పి విజయసాయిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విశాఖలోని KGH హాస్పిటల్లో కరోనా బాధితులకు అందుతున్న సేవలను స్వయంగా తెలుసుకునేందుకు కరోనా వార్డులోకి వెళ్లారు. డాక్టర్లు వారించినా పి.పి.ఈ కిట్ ధరించి నేరుగా కరోనా రోగుల వద్దకు వెళ్లారు. ఒక్కొక్క బెడ్ వద్దకెళ్లి చికిత్స పొందుతున్న పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లేనిపోని అనుమానాలు, భయాలు…