నేడు పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం కానున్నారు. ఋషికొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి మూడో విడత వారాహి యాత్రను స్టార్ట్ చేయనున్నారు. అయితే, విశాఖ ఎయిర్ పోర్ట్ లోపల హై సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఎరివల్ పాయింట్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటి ఫోర్స్ తమ అధీనంలోకి తీసుకుంది. బారి కేడ్లు, రోప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేటి నుంచి స్టార్ట్ కానుంది. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రను పవన్కళ్యాణ్ ఇవాళ్టి నుంచి మొదలు పెట్టనున్నారు. ఆగష్టు 19 వరకు ఈ వారాహి యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
విశాఖలో రేపటి నుంచి జనసేనాని పవన్కళ్యాణ్ చేపడతున్న వారాహియాత్రపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మూడో విడత వారాహి యాత్రకు పోలీసులు పలు నిబంధనలు విధించారు. కొన్ని షరతులతో యాత్రకు అనుమతులు జారీ చేశారు.
గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి.
సీఎం విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు.
చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి తరం పిల్లలు. చదువుకునే విద్యార్థుల నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ చాలా మంది తమ సమస్యలకు బలవన్మరణమే పరిష్కారమని భావిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు.