అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది.
టీడీపీ మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి అరెస్టుపై ఉత్కంఠ.. అర్ధరాత్రి తర్వాత పరవాడ మండలం వెన్నెల పాలెంలో భారీగా మోహరించిన పోలీసులు.. బండారు ఇంటికి వెళ్లే మార్గాలు మూసివేత.. ఇటీవల మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండారు..
విశాఖపట్నం వేదికగా జాతీయ అండర్–11 చెస్ చాంపియన్షిప్ పోటీలు నేటి( ఆదివారం ) నుంచి విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన నిర్ణయం అభివృద్ధికి సూచిక అంటూ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశాఖ పరిపాలన రాజధాని అంటున్నారు.. అదే చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 23 విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచే సీఎం జగన్ పాలన చేస్తారు అని పేర్కొన్నారు. ఏర్పాట్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు అని అమర్నాథ్ వెల్లడించారు.
మూఢనమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారు. నేల నుండి నింగికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా.. ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కళ్లకి ఎదురుగా మూఢనమ్మకాల పేరుతో డబ్బు దోచుకుంటున్న అపరచితులని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.