ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు.
ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు, డెబిడ్ కార్డులపై తరచూ పేమెంట్స్ చేస్తున్నారా? ప్రతీసారి సీవీవీ ఎంటర్ చేయాలని అడుగుతుందా? అయితే, ఇక ఆ కష్టాలు తొలగిపోనున్నాయి.. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడేవారికే శుభవార్త చెప్పింది పేమెంట్స్ దిగ్గజం వీసా.. ఆ కార్డుల ద్వారా చేసే పేమెంట్లకు ఇకపై సీవీవీ అవసరం లేదని స్పష్టం చేసింది..
అదనంగా డబ్బు సంపాదించి, తమ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఎంతో మంది భావిస్తారు.. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్తారు.. అయితే, ఇదే సమయంలో.. కొందరు ఏజెంట్ల బారిన పడి.. నిండా మునగడమే కాదు.. జైలులో మగ్గాల్సిన పరిస్థితి.. సంపాదన లేదు.. కుటుంబానికి దూరమై.. జైలులో ఒంటరిగా మగ్గాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లాకు చెందిన మహిళలు నకిలీ వీసా ఏజెంట్ల బారిన పడ్డారు. నకలీ వీసా మోసానికి గురైన పలువురు మహిళలు కేరళలో…
అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితులు. అలాగని అన్నీ వదులుకుని రావడం సుతరామూ ఇష్టం వుండదు కొందరికి. వరద ప్రాంతాలైనా.. వార్ ప్రాంతాల్లోని వారికైనా ఇది సహజం. యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ నుండి తన పెంపుడు పిల్లితో సహా హైదరాబాద్ చేరుకున్నాడో యువకుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన పుదూరు ప్రఖ్యాత్ ఉక్రెయిన్ లో వుంటున్నాడు. తన పిల్లికి వీసా, టికెట్ తీసుకుని విమానంలో సొంత గడ్డకు చేరుకోవటంతో అది…
ఇటీవల కాలంలో గోల్డెన్ వీసా అనే పదం బాగా వినిపిస్తున్నది. విదేశీ పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించేందుకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను తీసుకొచ్చింది. గోల్డెన్ వీసా వచ్చింది అంటే వారు యూఏఈ పౌరసత్వం పొందినట్టే అనుకోవచ్చు. వ్యాపారవేత్తలు, పర్యాటకులు, శాస్త్రవేత్తలు, కళాకారులకు గోల్డెన్ వీసాను అందిస్తుంటారు. ఇలాంటి వారందరికీ గోల్డెన్ వీసా అందిస్తారా అంటే లేదని చెప్పాలి. విద్యార్థులకైతే ప్రతిభ ఆధారంగా గోల్డెన్ వీసాలను అందిస్తారు. అదే కళాకారులకైతే వారి రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలి. అదేవిధంగా…
కరోనా తరువాత చదువు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఇండియా నుంచి యూకే వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో మరింత ఎక్కువ మంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు యూరప్ దేశాలు సైతం జానాభాను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కరోనా సంక్షోభంలో యూరప్ లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు యూరప్ దేశాలు వీసాలను సులభతరం చేసింది. Read:…
రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ హారీష్ అనే యువకుడికి 11 ఏళ్ల క్రితం పాక్ కు చెందిన ఉస్రా ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాజస్థాన్‌లోని ఓ పెద్ద కంపెనీలో హారిష్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. దేశాలు వేరు కావడంతో ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఒకసారి పాక్ వెళ్లి ఉస్రా తల్లిదండ్రులను కలిసి ఒప్పించాడు. వివాహానికి వారి బంధువులు కూడా ఒప్పుకున్నారు. ఇక పెళ్లి బాజాలు మోగుతాయి అనుకున్న సమయంలో…
మనదేశం నుంచి విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ అవసరం ఎంతో ఉంటుంది. అయితే, ఇతర దేశాల్లో పర్యటించాలి అంటే తప్పనిసరిగా వీసా కావాలి. కానీ, కొన్ని దేశాల పాస్ పోర్ట్‌లు ఉంటే చాలు వివిధ దేశాల్లో ఎంచక్కా పర్యటించి రావొచ్చు. వీసాతో అవసరం లేదు. సింగపూర్, జపాన్ దేశాలకు సంబంధించిన పాస్‌పోర్టులు ఉంటే చాలు. వీసాలతో అవసరం లేకుండా 192 దేశాలకు వెళ్లిరావొచ్చు. ప్రయాణాలకు అత్యంత స్నేహపూరితంగా ఉండేలా పాస్‌పోర్టులు ఇచ్చే దేశాల ఆధారంగా ఈ వెసులుబాటు…
కాబూల్‌లో ప్రస్తుం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకున్నా ఆ తరువాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయే, మహిళలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. అందుకోసమే వీలైనంత వరకు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఎంబసీలు మూసేయ్యడంతో విదేశాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీనికోసం భారత ప్రభుత్వం ఇ ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనికోసం…