Fraud : అమాయకులకు మాయ మాటలు చెప్పి వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ అనే వ్యక్తిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లంకపల్లి మేరీ అనే మహిళకు వర్క్ వీసాకు బదులుగా విసిటింగ్ వీసా ఇప్పించాడు అకుమర్తి సత్యనారాయణ. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న లంకపల్లి మేరీతో పాటు కొండలమ్మను ఇమిగ్రేషన్ అధికారులు చెకింగ్ చేయడంతో వారు వర్క్ వీసాకు…
Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…