ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు, డెబిడ్ కార్డులపై తరచూ పేమెంట్స్ చేస్తున్నారా? ప్రతీసారి సీవీవీ ఎంటర్ చేయాలని అడుగుతుందా? అయితే, ఇక ఆ కష్టాలు తొలగిపోనున్నాయి.. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడేవారికే శుభవార్త చెప్పింది పేమెంట్స్ దిగ్గజం వీసా.. ఆ కార్డుల ద్వారా చేసే పేమెంట్లకు ఇకపై సీవీవీ అవసరం లేదని స్పష్టం చేసింది..