మీరు వోక్స్‌వ్యాగన్ వర్టస్ లేదా టిగువాన్ కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి అవకాశం. ఈ రెండు కార్లపై వోక్స్‌వ్యాగన్ రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాకుండా.. కస్టమర్లకు 4 సంవత్సరాల ప్రామాణిక వారంటీ (స్టాండర్డ్ వారంటీ), పాత పోలో కార్ల యజమానులకు రూ. 50,000 ప్రత్యేక లాయల్టీ ప్రయోజనం కూడా అందిస్తోంది.