India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల…
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Virat Kohli: అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం క్రికెట్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలను కూడా ఆహ్వానించారు.
Monty Panesar advising England team to tackle Virat Kohli: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ 2023-25 ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. అందుకే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం…
Ayodhya Ram Mandir Guest List: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి శ్రీరాముడికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్…
Rohit Sharma react on Virat Kohli Golden Duck in IND vs AFG 3rd T20: స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ టీ20 పునరాగమనం చేశారు. 3వ టీ20లో రోహిత్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 ఆడని కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 16 బంతుల్లో 29…
Virat Kohli Records First Golden Duck in T20Is: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా…
Virat Kohli: స్టార్ క్రికెటర్, కింగ్ విరాట్ కోహ్లీకి రామ మందిర ఆహ్వానం అందింది. కోహ్లీ, అనుష్క దంపతులను జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానం అందించింది. అంతకుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఆహ్వానం అందింది. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులకు కూడా రామ మందిర ట్రస్టు ఆహ్వానాలను అందించింది.
తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.
వెస్టిండీస్, యూస్ఏలలో జరగబోయే ICC టీ20 ప్రపంచ కప్ లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కోరాడు. ఈ పిచ్ ల్లో మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసే అవకాశాలు ఉంటాయని.. కాబట్టి వీరి జోడి మంచిగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్‌లో చూసినట్లుగా పవర్‌ప్లే ఓవర్లలో కోహ్లీ…