Virat Kohli: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్.. మిగతా 3 టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli likely to out from Last 3 Tests vs England: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే మూడు మరియు నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో తమ నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లకు దూరం అయిన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా.. తాజా సమాచారం ప్రకారం 3,4 టెస్టులకు కూడా దూరమవుతాడని తెలుస్తోంది. విరాట్ ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడడం కూడా సందేహమేనట.
తాను జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై విరాట్ కోహ్లీ.. బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. నేడు బీసీసీఐ సెలెక్టర్లు ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. విరాట్ వల్లే జట్టు ప్రకటన ఆలస్యం అవుతోందని సమాచారం. విరాట్ ఆడేది లేనిది నేడు తేలిపోనుంది. ఇక తన భార్య అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలోనే విరాట్ ఆటకు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.
Also Read
Also Read: SA20 2024: హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం.. సౌతాఫ్రికా టీ20 ఫైనల్‌కు సూపర్ జెయింట్స్!
ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. బుమ్రా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు