ఈ కార్యక్రమంలో కింగ్ కోహ్లీ అనుభూతి ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు.. తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ మీరంతా ప్రశాంతంగా ఉండండి.. మేము త్వరగా చెన్నైకి వెళ్లాలి.. మీరు ( యాంకర్ ను ఉద్దేశించి ) నన్ను కింగ్ అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటుంది.. జస్ట్ విరాట్ అని పిలవండి అని కోహ్లీ పేర్కొన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇదొక శుభవార్త. ఆర్సీబీ (RCB) కొత్త జెర్సీ లీక్ అయింది. ఈ జెర్సీని ఆర్సీబీ రివీల్ చేయాల్సి ఉండగా.. జెర్సీ లీక్ అయిపోయింది. ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కొత్త జెర్సీలో కనిపిస్తున్నారు. కోహ్లీ తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు కోహ్లి, సిరాజ్‌లు కొత్త జెర్సీ ధరించిన ఫొటో వైరల్ అవుతోంది.
దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.
ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన జట్టు సభ్యులతో చేరాడు. ఆదివారం నాడు అర్థరాత్రి జట్టు సభ్యులతో చేరిన కోహ్లీ ఇవాళ (సోమవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Virat Kohli Congratulations RCB after Win WPL 2024 Title: 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఆడుతోంది. ఐపీఎల్లో ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగుపెట్టింది. తొలి సీజన్లో అందరినీ నిరాశపరుస్తూ.. పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది మహిళా జట్టు అద్భుతం చేసింది.…
Virat Kohli Lands in India for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 6 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సమయంలో ఆర్సీబీ అభిమానులకు ఓ శుభవార్త. లండన్ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్…
Harbhajan Singh Counter Pakistan Fan Over IPL 2024: భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లో కూడా ఐపీఎల్‌కు ఫాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఐపీఎల్‌ని వీక్షిస్తుంటారు. అయితే భారత టీ20 లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందని ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB).. ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్‌ను సాధించలేకపోయింది. ప్రతీ సీజన్లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినప్పటికి.. చివరి నిమిషంలో బొక్కాబోర్లా పడడం బెంగళూరు టీమ్ కి అలవాటుగా మారింది.
Virat Kohli To Join RCB Squad On March 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 9 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఆర్సీబీకి ఓ శుభవార్త. వ్యక్తిగత కారణాలతో గత రెండు నెలలుగా మైదానంలోకి దిగని…
విరాట్ కోహ్లీ నేటితో ఆర్సీబీతో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 2008 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి వారితోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు లీగ్ లోని ప్రతి సీజన్ లో ఒక ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ మొదటగా రూ.12 లక్షలకు ఆర్సీబీలో చేరాడు. ఐపీఎల్ 2008 డ్రాఫ్ట్ లో విరాట్ కోహ్లీ రూ.12 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు.