Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Criticises Wankhede Crowd: దశాబ్దానికి పైగా భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. భారతీయ అభిమానుల్లో చెరగని ముద్ర వేశాడు. విరాట్ తన బ్యాటింగ్‌తో భారత్‌లోనే కాదు విదేశాల్లో కూడా ఎందరో అభిమానులను సంపాదించాడు. కింగ్ మైదానంలోకి దిగుతున్నాడంటే.. మైదానం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ఫాన్స్ అందరూ ‘ కోహ్లీ-కోహ్లీ’ అంటూ అరుస్తూ స్టేడియాన్ని హోరెత్తిస్తుంటారు. అయితే భారత స్టేడియంలో ఇండియన్ ఫాన్స్.. కోహ్లీ-కోహ్లీ అని కాకుండా ‘చీటర్-చీటర్’ అని నినాదాలు చేశారు. ఇది కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసింది.
సొంత దేశంలో విరాట్ కోహ్లీని ‘చీటర్-చీటర్’ అని భారత ఫాన్స్ నినాదాలు చేసిన ఘటన 11 సంవత్సరాల క్రితం జరిగింది. ఐపీఎల్ 2013 సీజన్‌లో విరాట్ తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలోని ఫాన్స్ ‘చీటర్-చీటర్’ అంటూ నినాదాలు చేశారు. ప్రేక్షకుల ఈ చర్యతో విరాట్ హృదయం బద్దలు అయింది. అదే వాంఖడే స్టేడియంలో 2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో 50వ సెంచరీని సాధించిన సమయంలో స్టేడియం మొత్తం ‘కోహ్లీ-కోహ్లీ’ అంటూ కేకలు వేయడం గహనార్హం.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Dinesh Karthik: దినేష్ కార్తీక్ స్కూప్ సిక్స్.. విరాట్ కోహ్లీ సంబరాలు!
ఇలాంటి ఘటనే తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్‌ను ఫాన్స్ ట్రోల్ చేశారు. గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్.. ఈసారి ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ని కెప్టెన్‌గా చేయడంతో అసంతృప్తిలో ముంబై అభిమానులు హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకులు అతనిపై అసభ్య పదజాలం ఉపయోగించారు. మైదానంలో కుక్క పరుగెడుతుండగా.. హార్దిక్, హార్దిక్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబదించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
8 years ago, Virat Kohli was booed and called a CHEATER by the fans in Mumbai. He said such incidents create hate amongst the players.
Now everytime he walks out to bat here, people cheer for him! ❤️
PS – I was there at Wankhede that day. But this isn’t recorded by me. pic.twitter.com/Md27gQAfvf
— Vinesh Prabhu (@vlp1994) April 28, 2021
తాజావార్తలు
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!