RCB vs PBKS: ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం.. ఈ విజయానికి అతడే కారణం: ఆర్‌సీబీ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faf du Plessis Says Virat Kohli very passionate about playing cricket: దినేశ్ కార్తీక్ కారణంగానే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. మహిపాల్ లోమ్రోర్ చేసిన పరుగులు విజయానికి బాటలు వేశాయని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడు విలువైన పరుగు చేశాడని కొనియాడాడు. డీకే వంటి ఆటగాడు జట్టులో ఉండటం తమ అదృష్టం అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. దినేశ్ కార్తీక్ 10 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ… ‘బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం వేరేలా ఉంది. టోర్నీ ఆరంభంలోనే విజయాలు సాదించాలి. త్వరలోనే వరుస విజయాలు ఆదుకుంటామని ఆశిస్తున్నా. మా ఆటగాళ్లు చివరి వరకు ప్రశాంతంగా ఆడారు. దినేశ్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఓడిపోతామని అనుకోలేదు. కొత్త రూల్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఉంది. మహిపాల్ లోమ్రోర్ మంచి బ్యాటర్ అని తెలుసు. అతను ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఎక్స్‌ట్రా బ్యాటర్ ఉన్నప్పుడు ఓవర్‌కు 14-15 పరుగులు చేయాల్సి ఉన్నా.. విజయం సాధించవచ్చు’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!
‘దినేశ్ కార్తీక్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం మా అదృష్టం. నేను గత రాత్రి చెప్పినట్లుగానే అతడు ఐపీఎల్‌ను ఆత్మవిశ్వాసంతో కొనసాగించడం చాలా ముఖ్యం. మిగిలిన టోర్నమెంట్‌కి అది బాగా ఉపయోగపడుతుంది. డీకే అనుభవం మాకు చాలా అవసరం. ఈ ప్రణాళికలతోనే అతడిని రిటైన్ చేసుకున్నాం. చిన్నస్వామి మైదానం పిచ్ డీఎన్‌ఏ తెలుసుకోవడం చాలా కష్టం. ఇది చాలా విభిన్నమైన మైదానం. ఈ రోజు పిచ్ చాలా భిన్నంగా ఉంది. పిచ్ ఫ్లాట్‌గా ఉంది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. క్రికెట్ అంటే అతడికి ఎంతో పిచ్చి. ఐపీఎల్‌కు ముందు తీసుకున్న బ్రేక్ కోహ్లీకి బాగా కలిసొచ్చింది’ అని ఫాఫ్ డుప్లెసిస్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!