క్రికెట్‌లో కన్నా వింబుల్డన్‌లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో.. వింబుల్డన్ ప్రతి మ్యాచ్‌లోనూ అంతే ఉంటుందన్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం గ్రేట్ అని విరాట్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2025 టోర్నీ జరుగుతోంది. లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. సోమవారం జకోవిచ్, మినార్ మధ్య మ్యాచ్‌ను సతీసమేతంగా వీక్షించాడు. మ్యాచ్ అనంతరం స్టార్…