Virat Kohli Wankhede Speech: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో తాను కనెక్ట్ కాలేకపోయానని, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిస్తున్నామన్నాడు. ఇంత మంది అభిమానులను చూస్తుంటే.. తనకు చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు.. గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.…