ఇది కలియుగం. ప్రస్తుతం సాధారణ పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. అలాగే ఓ జంట తమ పెళ్లిని విభిన్నంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించింది. వెడ్డింగ్ కార్డ్‌ను ఆకర్శణీయంగా మలచింది. పెళ్లి పత్రికను మొదటిసారి చూసినప్పుడు ఓ ఆధార్ కార్డులా కనిపించింది. అయితే తర్వాత సరిగ్గా చూసేసరికి అది పెళ్లి కార్డు అని తెలిసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన శుభలేక చర్చనీయాంశమైంది. కార్డు ప్రసిద్ధి చెందడానికి కారణం దానిపై ముద్రించిన చిత్రం. ఆ చిత్రాన్ని చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. యూపీలోని అమేథీలో ముస్లిం కుటుంబానికి చెందిన ఓ కుమార్తె పెళ్లి కార్డుపై హిందూ దేవుళ్లు, దేవత ఫొటోలు ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది.
Viral Wedding Card: సాధారణంగా మనుషులకు పేరు ఎలా ఉంటుంది.. అందరు పిలిచే విధంగా ఉంటుంది. కొంతమంది తాతబామ్మల పేరు కలిసేలా పిల్లలకు పెడతారు. ఇంకొంతమంది దేవుళ్ళ పేర్లు కలిసేలా పెడతారు. మరికొంతమంది ప్రేమించినవారికి మర్చిపోలేక.. తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకొని ఆనందిస్తుంటారు.