సాధారణంగా పొలాలకు వెళ్లే వాహనాల్లో పాములు ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.. కానీ గాల్లో ఎగిరే ప్లైట్ లో పాము ఉండటం ఎప్పుడైనా చూశారా? అందులోకి ఎలా వెళ్తుంది డోర్స్ ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటారుగా అనే సందేహాలు కూడా వస్తుంటాయి.. ఇది నిజం.. నిజంగా ఓ విమానంలో పాము దూరింది.. కాసేపు ప్రయాణికులకు ముచ్చేమటలు పట్టించింది.. వెంటనే ఫ్లైట్ సిబ్బంది అలెర్ట్ అయ్యి పామును పట్టుకున్నారు.. దాంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో…
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. ఈవెంట్ ఏదైనా ఆయన మాటలకు ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి మొన్న గోవాలో ఆయన చేసిన విన్యాసాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసాము… నేడు దుబాయ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
జల్లికట్టు ఎద్దుకు బలవంతంగా తినిపిస్తున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేాకాకుండా ఆ వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోలో ఒక ఎద్దుకు నోటిలో కోడిని పెట్టి నమలమని బలవంతం చేశారు. అంతేకాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఎద్దును గట్టిగా పట్టుకోగా, ఒకరు కోడిని నోటిలో పెట్టడం లాంటివి చేశారు.
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టికెట్ తీసుకోలేదని అతి దారుణంగా కొట్టాడు రైల్వే టీటీఈ. ఈ ఘటన బరౌనీ-లక్నో ఎక్స్ప్రెస్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టికెట్ తీసుకోలేని పాపానికి మరీ ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా.. టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి కానీ, చేయి ఉంది కదా అని ఎలా పడితే అలా కొట్టేయడమేనా..?. ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తిని అంత దారుణంగా కొడుతుంటే పక్కన ఉన్న…
Heart Attack: ఇటీవల కాలంలో యువకులతో పాటు టీనేజ్లో ఉన్న యువకులు కూడా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో క్లాస్ వింటూనే గుండెపోటుతో కూలిపోయాడు ఓ విద్యార్థి.
కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంతకు అతను దగ్గర నుంచి ఏం తీసుకెళ్లిందని అనుకుంటున్నారా.. మొబైల్ ఫోన్. అది కూడా మాములు ఫోన్ కాదు.. ఐఫోన్.
సమోసా అంటే అందరికీ నోరు ఊరిపోతుంది..మిర్చి బజ్జీల తర్వాత ఆ స్థానం సమోసాలదే.. మనం ఇప్పటివరకు స్పైసిగా ఉండే రకరకాల సమోసాలను తిని ఉంటారు.. అయితే ఇప్పుడు చెప్పుకొనే సమోసాను ఎప్పుడు చూసి ఉండరు.. కానీ దీన్ని చూస్తే ఇక వేరే సమోసాలను తినరు.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ఓ వ్యాపారి బ్లూ బేర్రి సమోసాను ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ సమోసాను ఒకసారి చూసేద్దాం.. ‘బ్లూబెర్రీ సమోసా’,…
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి బెంగుళూరులో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు.. మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇప్పుడు క్లింకార, అల్లు అర్హ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఓ సినిమా కూడా చేసింది.. సోషల్ మీడియాలో అర్హ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఉపాసన క్లింకారను ఎత్తుకొని…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్లకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.. గతేడాది జూన్లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు.. ఎంతో పవిత్రమైన అర్థం వచ్చేలా లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు అర్థాన్ని…
తల్లి దండ్రుల ప్రేమ వెలకట్టలేనిది.. ఎంత రుణం తీర్చుకోవాలని అనుకున్న సరిపోదు.. పిల్లల పై వారి ప్రేమ అనంతం.. పిల్లల ఇష్టం తమ ఇష్టంగా భావించి ఎంతకష్టమైన వాటిని తీర్చేందుకు చూస్తారు.. తమ పిల్లల సంతోషమే తమ సంతోషంగా చాలామంది భావిస్తారు. తాజాగా ఓ వృద్ధుడు తన కూతురికి చెరుకు గడలంటే ఇష్టమని 14 కిలోమీటర్లు చెరుకు గడలను తల మీద పెట్టుకొని సైకిల్ తొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే..…