Blood Donation: రక్తదానం చేయడం గొప్పదానంతో సమానం. మనం చేసే రక్తదానంతో ఒకరి ప్రాణం నిలబెట్టవచ్చు. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పరిగణిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎన్నడూ రక్తం కొరతతో ఏ ప్రాణం పోకూడదని.. ఇందుకోసం దేశంలోని ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నానని ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చాక అందరం కలిసికట్టుగా…
Kamal Haasan: లోకనాయకుడు ‘కమల్ హాసన్’ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. మరో పాన్ ఇండియా హిట్‌ను టార్గెట్ చేసిన కమల్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి ‘భారతీయుడు 2’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కు షెడ్యూల్ గ్యాప్ రావడంతో బిజినెస్ పని మీద హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్, తనకి ఎన్నో మైల్ స్టోన్ సినిమాలను ఇచ్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్, కె.విశ్వనాథ్‌కు…
Rare Disease: సాధారణంగా ప్రతి మనిషికి తల, మర్మాంగాలను మినహాయిస్తే చెస్ట్, కాళ్లు, చేతులపై మాత్రమే వెంట్రుకలు పెరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల లలిత్ పాటిదార్ మాత్రం అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హైపర్ ట్రికోసిస్ అనే వ్యాధి కారణంగా లలిత్ పాటిదార్ శరీరం అంతటా విపరీతంగా వెంట్రుకలు పెరుగుతున్నాయి. ఆరేళ్ల వయసు నుంచి తనకు శరీరం అంతటా వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయని, పాఠశాలలో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ పాటిదార్ చెబుతున్నాడు. కోతి…
Scientist Claims Mystery Behind Sheep Walking In Circle In China Solved: ఇటీవల ఇంటర్నెట్ లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. చైనాలో ఓ గొర్రెల మంద అదేపనిగా వృత్తాకారంలో తిరగడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియో చాలా మందిని కలవరపాటుకు గురిచేసింది. వరసగా 12 రోజుల పాటు పెద్ద గొర్రెల మంద సర్కిల్ ఆకారంలో ఒకదాని వెనక ఒకటి తిరుగుతున్న వీడియో ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ లో…
Nellore District: ఈ లోకంలో కన్నబిడ్డలపై ప్రేమ లేని తల్లిదండ్రులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరు తమ ప్రేమను బయటకు చాటుకుంటారు.. కొందరు అయితే తమ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటారు. అయితే ఓ తండ్రి మాత్రం తన ప్రేమను ఎవరికీ సాధ్యం కాని రీతిలో చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామంలో ఓ తండ్రి తన కుమార్తె జ్ఞాపకంగా ఆలయం కట్టించాడు. నిత్యం అందులో పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు. కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య,…
Viral News: స్కాట్లాండ్లోని ఓ ఇంట్లో మరమ్మతుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 140ఏళ్ల కిందటి లేఖ బయటపడింది. మందు బాటిల్లో భద్రపరిచిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదని పలువురు భావిస్తున్నారు.
Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు సాధారణంగా బ్యాంకులు రోజులో ఆరేడు గంటలు పనిచేస్తుంటాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం అరగంటే పనిచేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బడిలోని బ్యాంక్. ఇక్కడ స్కూల్ విద్యార్థులే ఉద్యోగులు. వాళ్లే ఇక్కడ బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల చొరవతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేసుకుని…
Love Signs: ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషితో ఉండే అన్ని బంధాల్లో ప్రేమ బంధం చాలా గొప్పది. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి పనైనా చేసేందుకు కొందరు సిద్ధంగా ఉంటారు. అది ప్రేమ గొప్పతనం. అయితే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడుకుంటే ప్రేమలో పడ్డారని పలువురు అంటుంటారు. కానీ తాము ప్రేమలో ఉన్నామా అని ప్రేమలో పడ్డవాళ్లకు కూడా తెలియకపోవచ్చు. తాము ప్రేమలో ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్య సంకేతాలు గమనించాలి.…
Marathon: సాధారణంగా ఎవరైనా నిలబడి లేదా కూర్చుని ప్రశాంతంగా సిగరెట్ కాలుస్తారు. కప్పు టీ లేదా కాఫీ తాగుతూ రిలీఫ్ కోసం సిగరెట్ తాగేవాళ్లనే ఇప్పటి వరకు మనం చూశాం. కానీ చైనాకు చెందిన 50 ఏళ్ల చెన్ అనే వ్యక్తి మాత్రం అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్లు పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మొత్తం మారథాన్‌ను 3 గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. జియాండే సిటీలోని జినాన్ జియాంగ్ మారథాన్…