Viral News: ఏడాదిన్నర ప్రాయంలో కిడ్నాప్ కు గురైన తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా పోయింది. తిరిగి 51 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుటుంబాన్ని కలుసుకుంది. అత్యంత అరుదైన ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటన అమెరికా టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్టా అపంటెంకో అనే మహిళకు ఓ పాప ఉండేది. ఉద్యోగం వల్ల తీరక లేకపోవడంతో చిన్నారిని చూసుకునేందుక ఆయాను పెట్టాలనుకున్నారు. తనకు దగ్గరి వాళ్లు ఆమె రూమ్ మేట్ ఓ మహిళ ఉందని చెప్పడంతో వివరాలు కనుక్కోకుండానే పనిలో పెట్టుకున్నారు. అయితే వచ్చిన ఆయా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పాపను కిడ్నాప్ చేసింది. టెక్సాస్ ఫోర్ట్ వర్త్‌లోని ఇంటిలో ఆగస్టు 23,1971న మెలిస్సా హైస్మిత్‌ను కిడ్నాప్ చేశారు.
Read Also: MLC Jeevanreddy: ఏం.. ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదా?
చిన్నారి కన్పించకపోవడంతో కంగారు పడిపోయిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. వారు కిడ్నాప్ కేసు పెట్టి పాపకోసం గాలింపు జరిపారు. కానీ పాప ఆచూకీ లభించలేదు. కన్న తల్లి మాత్రం తన బిడ్డ కోసం అప్పటినుంచి వెతుకుతూనే ఉంది. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ బిడ్డ ఫోర్ట్ వర్త్‌కు 1100 మైళ్ల దూరంలో ఉందనే విషయం బంధువుల ద్వారా అల్టాకు తెలిసింది. వెంటనే వాళ్లు అధికారులను సంప్రదించి డీఎన్‌ఏ టెస్టు నిర్వహించాలని కోరారు. పాప పుట్టిన తేదీ, పుట్టుమచ్చలు, డీఎన్‌ఏ ఫలితాల ఆధారంగా 51 ఏళ్ల క్రితం కిడ్నాపైంది తనేనని అధికారులు నిర్ధరించారు. దీంతో బాల్యంలో తప్పిపోయిన మెలిస్సా హై స్మిత్ 51ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరింది. ఇన్నేళ్ల తర్వాత తమబిడ్డను చూసి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆనంద పరవశంలో మునిగిపోయారు. అయితే, దర్యాప్తు అధికారులు ఈ కేసును చాలా సార్లు తప్పుదోవ పట్టించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గైనకాలజిస్ట్ సాయంతోనే తమబిడ్డ దక్కినట్లు పేర్కొంది. పాప కిడ్నాపై చాలా ఏళ్లు కన్పించకపోవడంతో తల్లే పాపను హత్య చేసి ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది.