'ది కశ్మీర్ ఫైల్స్' పంథాలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' మూవీ సైతం వివాదలలో చిక్కుకుంటోంది. ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న నాలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ తో సహా కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.