స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని మోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానికి రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మణిపూర్ పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు.