Narendra Modi: ప్రజాకవి గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడ్డానని ఆయన భార్య విమలకు మోడీ లేఖ రాశారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోడీ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన…