నాలుగేళ్ళ క్రితం తమిళంలో రూపుదిద్దుకుని, కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘విక్రమ వేద’ మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ హిందీ వెర్షన్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రి ద్వయం హిందీ రీమేక్ నూ డైరెక్ట్ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను అబు దబీ లో పూర్తిచేశారు. అక్కడ దాదాపు…