Vikarabad: వికారాబాద్ జిల్లా దోమ మండలం రాకొండ గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం, అర్థరాత్రి ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా అర్జున్‌పై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో అర్జున్‌కు పొత్తికడుపు భాగంలో మూడు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి.…