విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనతో సీఎం భద్రతా సిబ్బంది, అధికారులు పరుగులు పెట్టారు.. వరదలో.. అందునా జేసీబీపై నాలుగున్నర గంటల పాటు 22 కిలో మీటర్లు పర్యటించిన సీఎం చంద్రబాబు. కాన్వాయ్‌ని వీడి 22 కిలోమీటర్ల మేర పర్యటించడం ఇదే తొలిసారంటున్నాయి అధికారిక వర్గాలు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జ్ పదవిపై టీడీపీ అధినాయకత్వం స్పష్టతనిచ్చింది. ఎంపీ కేశినేని నానికి విజయవాడ పశ్చిమ బాధ్యతల అప్పగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జ్ పదవిని చివరి వరకు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఆశించినప్పటికీ చంద్రబాబు కేశినేని వైపే మొగ్గు చూపారు. బుద్ధా, నాగుల్ మీరాకు ఇప్పటికే వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పదవిని కేశినేనినానికి అప్పగించారు. నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని…
భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ ఉండటంతో ఏర్పాట్లను మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ నివాస్, ఇంద్రకీలాద్రి దేవాలయ ఛైర్మన్, ఈవోలతో కలిసి పరిశీలించారు. దీక్షల విరమణ, గిరి ప్రదక్షిణ, కేశ ఖండనశాల, దర్శనం, ప్రసాదం పంపిణీ, అన్న ప్రసాదం వంటి ఏర్పాట్లపై ఆరా తీసిన…
ఎవ్వరూ లేనప్పుడు పోలీసుల అండతో దాడులు చేయించడం కాదు.. దమ్ముంటే చంద్రబాబు దీక్ష ముగిసేలోపు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలనా అస్తవ్యస్థంగా మారిందన్న ఆయన.. 13 జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ను, మాదక ద్రవ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారని.. ఇదే విషయాన్ని టీడీపీ బయటపెట్టిందన్నారు. ఇక, జె-బ్రాండ్లు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు బోండా ఉమ..…
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ సీయం జగన్. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో 11,775 వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. నేడో, రేపో ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కొత్తగా పీహెచ్‌సీల నిర్మాణం జరుగుతుండటంతో ఈ పోస్టులకు అదనంగా మరో3,176 భర్తీకి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. వీటికి కూడా వెంటనే నోటిఫికేషన్ విడుదల…