Ayyanna Patrudu Issue:నర్సీపట్నంలో టెన్షన్.. టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే.టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్ పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. మరోవైపు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేకు బ్రేక్ పడింది.
Also Read
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర రెవెన్యూ శాఖ ప్రారంభించిన సర్వేకు బ్రేక్ వేశారు. జాయింట్ సర్వే చేయించాలని అయ్యన్న కుటుంబం కోరింది. ప్రభుత్వ, ప్రయివేట్ సర్వేయర్ల సమక్షంలో రేపు భూమి సర్వే నిర్వహించాలని అభ్యర్థించారు. జాయింట్ సర్వేకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. పోలీసు భద్రత మధ్య భూమి కొలతలు తీస్తున్నారు రెవిన్యూ సిబ్బంది. రెండు సెంట్ల కాలువ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. అయ్యన్న కుటుంబానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నర్సీపట్నం తరలివస్తున్నారు.
అయ్యన్నపాత్రుడు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ల వరద సాగుతూనే వుంది. గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్‌గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్‌గా కనిపించింది. ఎన్టీఆర్ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 19, 2022
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!