AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్‌ను ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో…
High Court Serious: దక్షిణ మధ్య రైల్వే జీఎంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆదేశాలు ఇచ్చినా కోర్టుకు హాజరు కాకపోవడంపై మండిపడ్డింది.. రైల్వే జనరల్ మేనేజర్ విజయవాడ డీఆర్ఎం కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చినా రాకపోవటంతో స్పందించిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది.. కోర్టు అంటే లెక్కలేని తనమా అని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.. DRM స్థాయి అధికారిని కూడా కోర్టుకు రప్పించక…
Off The Record: కొన్ని రోజుల క్రితం బెజవాడ వైసీపీలో ఓ సంఘటన జరిగింది. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉదయభాను మీదకు వెల్లంపల్లి దూసుకెళ్లారనే చర్చ కూడా అప్పట్లో నడిచింది. ఈ గొడవంతా బెజవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఆకుల శ్రీనివాస్ గురించే. ఆకుల శ్రీనివాస్…
CM YS Jagan: విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు మార్లు ఆ ప్రాజెక్టు పనులు జరుగుతోన్న తీరుపై సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించారు.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి పైనా సమీక్ష చేశారు.. సివిల్ వర్క్స్, సుందరీకరణ పనులపై చర్చించారు.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్‌కు వివరాలందించారు అధికారులు. స్మృతివనం…
Nandamuri Balakrishna: అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్నారు నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విజయవాడలో వేగా జ్యూవెలరీ షోరూంను ప్రజ్ఞా జైస్వాల్, వేగా జ్యూవెలరీ సంస్థల ప్రతినిధులు నవీన్ కుమార్, సుధాకర్‌లతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేగా జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. చాలామంది బంగారు షాపు ప్రారంభోత్సవానికి వస్తున్నానంటే రకరకాలుగా మాట్లాడుకున్నారు.. ఆయన నాకేమీ పర్వాలేదు.. తెలుగువారిని ముందుండి నడిపించడంలో నేనెప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చారు.. ఇక,…