విజయవాడ సంకల్ప సిద్ది కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న డైరెక్టర్ గుత్తా కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు బెజవాడ పోలీసులు.. సంకల్ప సిద్ది కేసులో చైర్మన్ గుత్తా గోపాలకృష్ణ తర్వాత మొత్తం వ్యవవహరం నడిపించాడు కిరణ్. 4 నెలల క్రితమే చైర్మన్ గోపాలకృష్ణ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పటి నుంచి పరారీలో ఉన్న కిరణ్ ను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. కిరణ్ కోసం గత కొన్ని నెలలుగా బెంగుళూరు, గోవా, బళ్ళారి లో గాలిస్తున్నారు బెజవాడ పోలీసులు. ఎట్టకేలకు నిన్న రాత్రి బెంగుళూరు లో కిరణ్ ని అదుపులోకి తీసుకుని బెజవాడ తీసుకువచ్చారు పోలీసులు. 200 కోట్లకు పైగా సంకల్ప సిద్దిలో మోసం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా విచారణ చేస్తున్నారు పోలీసులు.
Read Also: Largest Afro : జుట్టు పెంచింది.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టింది..
ఈ సంకల్ప సిద్ధి కుంభకోణం కలకలం రేపింది. దీని విలువ 1400 కోట్లు వరకూ ఉంటుందని భావిస్తున్నారు. భూముల్లో ఎర్రచందనం మొక్కలున్నాయంటూ తప్పుడు ఆశలు చూపించి మోసం చేశారు. ధనార్జనే ధ్యేయంగా అబద్ధాలతో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.సంస్థ వసూలు చేసిన రూ.1400 కోట్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ దర్యాప్తు సాగింది. ఈ కుంభకోణంలో మొత్తం 40 మందికి పైగా అనుమానితులను పోలీసులు విచారించారు. ఈ సంస్థ ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయనే దానిపై, బ్యాంకు లావాదేవీలపై పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. గుత్తా కిరణ్ పట్టుబడడంతో అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు.
సంకల్ప సిద్ది కేసులో ఏ2 గా ఉన్నాడు గుత్తా కిరణ్. ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా మూడు రాష్ట్రాల్లో సంకల్ప సిద్ది మోసాలు బయటపడ్డాయి. 60 వేల మంది వరకు బాధితులు ఉన్నట్టు అంచనా వేశారు. ఇప్పటికే ఈ కేసులో 36 మందిని వరకు అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also: Theif : మంచి దొంగ.. దొంగతనం చేసి తిరిగి తెచ్చి పెట్టేశాడు