Jr NTR Photos In Chandrababu Rally: చంద్రబాబు ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హంగామా చేశారు తెలుగు తమ్ముళ్లు.. మచిలీపట్నం వెళ్తున్న చంద్రబాబుకి విజయవాడలో భారీ ఎత్తున స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు.. ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి తారక రత్న ఫోటో లను చూపిస్తూ హల్ చల్ చేశారు నందమూరి అభిమానులు.. గతంలో ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ఫొటోలతో పాటు.. తాజాగా, ఆస్కార్ ఉత్సవంలో పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫొటోలను.. కొన్ని సినిమాల స్టిల్స్‌ను.. ఫ్లెక్సీలుగా వేయించి ప్రదర్శించారు.. ఫొటోల ప్రదర్శనకే పరిమితం కాకుండా.. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.. దీంతో.. చంద్రబాబు చికాకు పడ్డారట.. ఫొటోలు ఏంటి? ఆ నినాదాలు ఏంటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటోల ప్రదర్శన.. సీఎం ఎన్టీఆర్ నినాదాలు చర్చగా మారాయి.