హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు.. స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు.. అయితే, నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు..
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 12వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు.
Heavy Rains: విజయవాడ నగరంలో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యంత వేడితో చెమటలు కక్కిన బెజవాడ ప్రజలకు ఊరట లభించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు.
ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ. ఈ క్రమంలో.. అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే.. ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించే లోపే…
Temple Clean: విజయవాడలో వైఎస్సార్సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో శుద్ధి చేసారు బీజేపీ నేతలు. ‘గోవు ఘోష విను గోవిందా’ పేరుతో గో మూత్రంతో ఆలయాలు శుద్ధి చేసారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మలు శుద్ధి చేసారు. ఐదేళ్ల జగన్ పాలనలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. లడ్డూ తయారిలో నెయ్యి కల్తీ అనేది…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన మూడు వారాలుగా చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు పలుకుతుంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. అమ్మకాలు తగ్గినా చికెన్ కు భారీగా డిమాండ్ పెరిగింది.
విద్యాసాగర్ రిమాండ్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..